విజయవాడ గురించివిజయవాడ భారతదేశపు పెద్ద నగరాలలో ఒకటి మరియు ఆంధ్రప్రదేశ్ లోని అతి పెద్దనగరాలలో మూడవది. కృష్ట్ణా నదిఒడ్డున గల ఈ పురాతన నగరమును బెజవాడ అని విజయవాడ అనీ కూడా పిలుస్తారు. బెజవాడ అనే పిలుపు ప్రస్తుతం అంతగా వాడుటలేదు. దక్షణ మద్య రైల్వేలో మరియు కోస్తా ఆంధ్రలో అతి పెద్ద జంక్షను విజయవాడదే. భారతదేశ అతి పెద్ద రైల్వే జంక్షన్లలో కూడా ఇది ఒకటి. విజయవాడ, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరాన బుడమేరు నదితో పాటు కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. రాజధాని హైదరాబాదు 275 కి.మీ. దూరములో కృష్ణా జిల్లాలో 58 చదరపు కి.మీ. విస్తీర్ణములో ఉంది. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 825,436. విజయవాడ చరిత్ర విశేషాలు. ఇవే కాక విజయవాడ అనేక ప్రత్యేకతలతో కూడుకొని ఉన్నది. ఈ నగర ముఖ్య ప్రత్యేకత క్రిష్ణానది వడ్డున కల కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఇక్కడి అధిష్టాన దేవత అయిన కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చినది. నాగార్జున సాగరు నుండి మచిలీపట్నము వరకు గల కృష్ణా పరివాహక ప్రాంతములలో రాతి యుగపు మానవుల సంచరించిన ఆనవాళ్ళు ఇక్కడ లభించాయి.ఇందువలన ఇక్కడ ప్రాచీన మానవులు నివశించారని, వాళ్ళ ద్వారా ఇక్కడి నాగరికత విలసిల్లినదిగా భావిస్తారు. అర్జునుడు ఈ ప్రాంతాలలో సంచరించుచున్నపుడు వేటగాని రూపములో ఉన్న శివుడిపై సాధించిన విజయానికి చిహ్నముగా ఇక్కడ విజయేశ్వరుడి (మల్లేశ్వర స్వామి లేదా జయసేనుడు)ని ప్రతిష్టించాడని, విజయము సాదించిన తదుపరి ఇక్కడ కల కనకదుర్గను విజయదుర్గగా కొలిచి పూజించాడని పురాణ గ్రంధాల ద్వారా తెలుస్తున్నది. వివిద పురాణాలలో విజయవాడను విజయవాత అని ఉదహరించారు.
|